Apr 08,2023 15:18
  • వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : పట్టణంలోని టోల్గేట్ సెంటర్ వద్ద ప్రయాణికుల వసతి కోసం నిర్మించిన బస్ షెల్టర్ నిర్మాణం ఏపీఎండిసి నిధులతో చేపట్టినట్లు జనసేన నాయకులు నాగేంద్ర పేపర్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వజారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్ షెల్టర్ నిర్మాణం పూర్తిగా తన సొంత నిధులతోనే చేపట్టడం జరిగిందని ఏపీఎండిసి నిధులకు సంబంధం లేదని అన్నారు. ఏపీఎండిసి నిధులతో బస్ షల్టర్ నిర్మాణం చేపట్టినట్లు జనసేన నాయకులు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. నిరూపించినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తానని, అలా నిరూపించకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను 20 సంవత్సరాల వయసు నుంచే ప్రజాసేవలో ఉంటున్నానని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మించామని అంతేకాకుండా ముస్లిం మైనారిటీ సోదరులకు ఈద్గా కూడా తన సొంత నిధులతోనే నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. కుక్కల దొడ్డి గ్రామం నుంచి తిరుమలకు నడక దారిన వెళ్లే భక్తుల సౌకర్యం కోసం కోటి రూపాయల వ్యయంతో ఒక షెల్టర్ కూడా నిర్మిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి డి నాగేంద్ర యాదవ్, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్, పట్టణ కన్వీనర్ రమేష్,నాగేంద్ర సర్పంచులు హరికృష్ణ రెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు,రామకృష్ణ, శ్రీరామ్ వినోద్,రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.