సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాలగౌడ
ప్రజాశక్తి - వీరబల్లి : హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఎవరికి అమ్ముకోవాలని ఏర్పాటు చేస్తున్నారని విశ్రాంత విశ్రాంతి సుప్రీం కోర్టు న్యాయమూర్తి గోపాలగౌడ అన్నారు. మండలంలోని వంగిమల్లలో ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయ బోతుందని పుకార్లు రావడంతో ఆయన ఆదివారం సందర్శించారు. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో తాము సర్వం కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకున్న అరకొర భూమిని ప్రభుత్వం లాక్కుంటే, తమ జీవనం ఎలా కొనసా గించాలని వాపోయారు. డికెటి భూమి ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటూ తోటలు కూడా వేసుకుంటున్నామని చెప్పారు. వాటన్నింటినీ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వమే తీసుకుంటుందని తెలుపుతున్నారని రైతులు న్యాయమూర్తికి దష్టికి తీసుకెళ్లారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతలని, వారు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ భూమి వారే హక్కు దారులన్నారు. ప్రభుత్వ భూమి అయినా ఇతర భూములైన వారికి సర్వహకులు ఉంటాయన్నారు. వారు హక్కులను కాలరాసే హక్కు ఏ ప్రభు త్వాలకు ఎక్క డుందని ప్రశ్నించారు. హైడ్రో ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజలకు రైతులకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలన్నారు. రైతులకు ఎటువంటి పారితోషకం ఇవ్వకుండా ప్రభుత్వం భూములను ఆక్రమించుకుంటే రైతుల పక్షాన ఉండి న్యాయపోరాటం చేస్తామన్నారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లిన కోర్టు ద్వారా వారికి ఆర్థిక సహాయం అందేలా తాము న్యాయ సలహాలు సూచనలు ఇచ్చి రైతుల పక్షపాతిగా నిలుస్తానన్నారు.
రైతులకు అన్యాయం చేస్తే న్యాయపోరాటం : జగన్ మోహన్ రాజు
ప్రాజెక్టు పేరిట రైతులకు అన్యాయం చేస్తే న్యాయపోరాటం చేసి న్యాయం జరిగేలా చూస్తామని టిడిపి జిల్లా నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. వంగిమళ్ల గ్రామాల రైతులకు ప్రాజెక్టు నిర్మాణం పట్ల చాలా అపోహాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఇప్పటికీ క్లారిటీ లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 1200 కోట్లు కేటాయిచారని, ప్రస్తుతం రూ.3 వేల కోట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. చాలామంది రైతులు తమ భూములు కోల్పోయే అవ కాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జై కిసాన్ అఖిలపక్ష రైతు సంఘం కార్య కర్త మద న్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ముందుగా ప్రాజెక్టు నిర్మాణం ఎలా ఉంటుందో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా వారికి ఎలాంటి భూములు ఉన్నా తగు పారితోషకం ఇచ్చి వారికి అనుగుణంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌విబిసి ఛానల్ డైరెక్టర్ వసంత కీర్తినారెడ్డి, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి రాజా, టిడిపి మండల శాఖ అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి సురేంద్ర, నాయకులు, రైతులు పాల్గొన్నారు.










