Oct 22,2023 23:55

ఎస్‌వియూ కావలి పిజి సెంటర్‌ పూర్వ విద్యార్థుల కలయిక

ఎస్‌వియూ కావలి పిజి సెంటర్‌
పూర్వ విద్యార్థుల కలయిక
ప్రజాశక్తి - క్యాంపస్‌ : ఎస్‌వి యూనివర్సిటీ పీజీ సెంటర్‌, కావలి లో ఎంఎస్‌ సి ఫిజిక్స్‌ చదివిన 1993-95 బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం తిరుపతి పట్టణంలో 30 సంవత్సరాల తరువాత ఎస్వీయూలో శనివారం కలిశారు. ఈ కార్యక్రమంలో కావలి పిజి సెంటర్‌కు సంబంధిం చిన ప్రొఫెసర్‌, ఎస్వీ యూనివర్సిటీ పూర్వపు వైస్‌ చాన్సలర్‌ ఎన్‌ ప్రభాకర్‌రావు, ప్రొఫెసర్‌ వైసి రత్నాకరం పాల్గొని అప్పటి విషయాలు గురించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపకులపతి ఆచార్య ఎన్‌ ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో కషి, పట్టుదలతో తమ లక్ష్యాలను చేరుకుని విజయం సాధించడం పట్ల గురువుగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు భౌతిక శాస్త్ర రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వివిధ రంగాలలో ఉన్నత స్థితిలో స్థిరపడిన తమ విద్యార్థులను చూసి గర్వపడ్డారు. పిజి సెంటర్‌ పూర్వపు విద్యార్థి, ప్రస్తుత ఎస్వీ యూనివర్సిటీ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌ బి.దేవప్రసాద్‌ రాజు సమక్షంలో తమ గురువులను శాలువాలు , పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.