ఎస్వీయూ ఓఆర్‌ఐ విశ్రాంత ఉద్యోగులకు సన్మానం
ప్రజాశక్తి - క్యాంపస్: ఎస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన, యన్‌యంఆర్ గా పనిచేస్తూ టీచర్ పోస్ట్ పొందిన ఉద్యోగులు ముగ్గురిని డైరెక్టర్ డాక్టరు పిసి వెంకటేశ్వ ర్లు శనివారం ఘనంగా సత్క రించారు. క్లర్క్, టైపిస్టు గా 25 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన గంగా సువర్ణ , రీసెర్చి అసిస్టెంట్ గా 24 సంవత్సరాలు సేవలందించిన డాక్టరు ఇ గురుమూర్తి మంచి నడవడికతో, నిబద్ధతో పనిచేశారని, 1998 డియస్సీలో క్వాలిఫైతో ఇటీవల ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగంలో చేరిన పద్మజ స్కానింగ్ , డిజిటలైజేషన్ నేర్పరితనంతో చేశారని వారి సేవలకు గుర్తుగా చిరు సన్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టరు రాజశేఖర్, డా. వెంటేశన్, డాక్టరు విజయకుమార్, చంద్రశేఖర్, సిద్దయ్య, నాగరాజు, శోభన్ బాబు, బాషా, రమేష్ రెడ్డి, విశ్వనాథ రెడ్డి, యోగీశ్వరరావు, సంతోష్ పాల్గొన్నారు.










