Sep 30,2020 23:21

mrps

ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించాలి 
ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అద్యక్షులు మందా కృష్ణ మాదిగ 
ప్రజాశక్తి-శింగరాయకొండ
ఎస్‌సి వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కోరారు. స్థానిక సాయి శ్రీనివాసకల్యాణ మండపంలో ఎస్‌సి వర్గీకరణ, రాజ్యాధికార సాధనపై ఎంఆర్‌పిఎస్‌ అనుబంధాల జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్‌పి వర్గీకరణ విషయంలో సుఫ్రీంకోర్టు ఆ రాష్ట్రాల నిర్ణయానికే వదిలివేస్తున్నట్లుగా ప్రకటించిందన్నారు. ఈ తీర్పు వచ్చి నెల రోజూలైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య, ఎంవిఎఫ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి దేవరపల్లి బిక్షాలు, రావినూతల కోటయ్య, సూరపోగు శ్యామ్‌ మాదిగ, వర్ల దేవదాసు, ఆలూరి చిరంజీవి, రేణుమాల మాధవ పాల్గొన్నారు.