Jul 18,2022 14:55

ప్రజాశక్తి-ఆచంట : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కనపాల పెద్దిరాజు డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట కచేరి సెంటర్లో సోమవారం మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముందుగా  రామేశ్వర స్వామి సత్రం నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ఆచంట కచేరి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమంలో పెద్ది రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిజెపి ప్రభుత్వం 1994 నుంచి మాదిగలను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 3వ తేదీన హైదరాబాదులో నిర్వహించిన ప్రధానమంత్రి సభలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్లస్ కార్డుతో శాంతియుతంగా నిరసన తెలియజేయడంతో ఎమ్మార్పీఎస్ నాయకులను కార్యకర్తలపై  బిజెపి ఆర్ఎస్ఎస్ గూండాలు దాడులు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కనపాల వెంకటేశ్వరరావు తత్తరముడీ శ్రీనివాస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.