ప్రజాశక్తి-రెడ్డిగూడెం : ఎస్సీ వర్గీకరణ కోసం రెడ్డిగూడెంలో 5వ రోజు కూడా నిరాహారదీక్ష కొనసాగింది. బిజెపి పార్టీ గతంలో మాదిగలకు ఇచ్చినమాటనిలబెట్టుకోవాలని అధికారంలోకి రాక మునుపు మాదిగలను నమ్మించి గెలిచిన తర్వాత ఎస్సీ వర్గీకరణ పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదని తెలిపారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు పరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చచేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లాది వీరయ్య మాదిగ రెడ్డిగూడెం, మండల ఇన్ఛార్జి మల్లాది రామారావు రెడ్డిగూడెం, మండల నాయకులు మండూరి నాగేశ్వరరావు, పల్లెపాం రమేష్, విస్సంపల్లి నాగరాజు చాట్ల సునీల్ (ఇజ్రాయెల్) మల్లాది చిన్నోడు కలపాల సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










