Jun 28,2022 10:52

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట : బుచ్చయ్యపేట మండలం లోని రాజాం గ్రామంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం ఎస్సీ కాలనీలో మంగళవారం మహాసంగ్రామం పాదయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ చోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ ఎలక మల్లి బాబు అన్నారు.  మందకృష్ణ మాదిగ గారు పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు  శ్రీకాకుళం నుండి జూన్ 3వ తేదీన పాదయాత్ర ప్రారంభించారని ఆ పాదయాత్ర ఇప్పుడు విశాఖ సిటీ లో జరుగుతుందని తరువాత అనకాపల్లి జిల్లాలో జరుగుతుందని ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క మాదిగ మహిళలు యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాజాం గ్రామం ఎమ్మార్పీఎస్ నాయకులు ఏలుసూరి పైడ్రాజు, శ్రీను,  బుజ్జి, బాలకృష్ణకోరుబిల్లి నాగరాజు,ఎమ్మార్పీఎస్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.