Apr 26,2023 19:01

హాజరైన రైతులు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :నానో డిఎపి ఎరువుల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమ తులిచ్చిందని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విట్టర్‌లో పేర్కొన్నట్లు ఇఫ్కో జిల్లా మేనేజర్‌ వి.ఆర్‌. లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. గురువారం మండలంలోని నరుకూరు రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారి యు గీతాకుమారి ఆధ్వర్యంలో నానో డిఎపిపై టివి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రైతులు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎ. రాజ్‌ కుమార్‌, గీతాకుమారితో కలిసి ఇఫ్కో ప్రతినిధి లక్ష్మీ నారాయణ వీక్షించారు. ఆయన నానో డిఎపి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిం దన్నారు.. ఆర్‌బీకే వీఏఏలు, ఇఫ్కో ట్రైనీ సతీష్‌ ఉన్నారు.