Apr 08,2023 20:07

మాట్లాడుతున్న పంతగాని నరసింహ ప్రసాద్‌

 రైల్వేకోడూరు : రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎపిఎండిసి మైనింగ్‌ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయ వనరులుగా ఉండగా దళిత నియోజకవర్గ అభివద్ధికి నిధుల కేటాయింపులో ఎండి వివక్షత చూపుతున్నారని టిడిపి సాంస్కతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ సంస్థలు ఆ ప్రాంత అభివద్ధి పనులకు గాను సిఎస్‌ఆర్‌ ద్వారా నిధులు కేటాయించి అభివద్ధి పనులు చేపట్టాలని, కానీ ప్రస్తుత ఎండి బాధ్యతలు చేపట్టిన అనంతరం పక్క నియోజకవర్గాలైన చిత్తూరు, కడప జిల్లాకు దాదాపు సిఎస్‌ఆర్‌ నిధుల ద్వారా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోడూరు నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్‌ అవసరం ఉందని స్థానిక ప్రజా ప్రతినిధులు కోర లేదా ఎండి గారు అని ప్రశ్నించారు. సిఎస్‌ఆర్‌ నిధుల ద్వారా వాటర్‌ ప్లాంట్స్‌ హాస్పిటల్స్‌ పక్క నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం ఎంతవరకు సబబు అని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎపిఎండిసి నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వాటర్‌ ప్లాంట్లు, స్కూళ్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేసిన ఘనత టిడిపికే చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు బొక్కసం సునీల్‌, పార్టీ బిసి రాష్ట్ర కార్యదర్శి మండ్ల అమర్‌, కూని చంద్రయ్య, కస్తూరి దినేష్‌, చిగురుపాటి శంకరయ్య పాల్గొన్నారు.