Oct 26,2020 16:26
ఎనలాగ్ డివైసెస్ కు ట్రిపుల్ ఐటి విద్యార్థులు 

నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటిలో రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న  ఏడుగురు ఈసిఈ విద్యార్థులు... బెంగుళూరుకు చెందిన ఎనలాగ్ డివైసెస్ సంస్థలో ఉద్యోగాలు సంపాదించారు. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటి నిర్దేశకులు ప్రొఫెసర్  గోపాల్ రాజు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో జరిగిన క్యాంపస్ సెలక్షన్ లో విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. రెండేళ్ళ పాటు లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్ వుంటుంది. ఈ సమయంలో  విద్యార్థులు  నెలకు రూ.30 వేలు స్టైఫండ్ పొందుతారని, అనంతరం రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాల్లో చేరనున్నట్లు ఆయన తెలిపారు.  అందుకు సహకరించిన చాన్సలర్ కెసి రెడ్ధి, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హెమచంద్రారెడ్ధి లకు గోపాల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.