ప్రజాశక్తి-నూజివీడు రూరల్ (ఏలూరు జిల్లా) : రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటిలకు సంబంధించి ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 20వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు బుధవారం తెలిపారు. ఈనెల 20, 21 తేదీల్లో నూజివీడు ట్రిబుల్ ఐటీలోను 21, 22 తేదీల్లో ఇడుపులపాయలోను, 24, 25 తేదీల్లో శ్రీకాకుళంలోనూ, ఒంగోలు ట్రిబుల్ ఐటీలో సీటు వచ్చిన అభ్యర్థులకు ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.










