Jul 10,2021 19:49
అస్సాం గవర్నర్‌ జగదీశ్‌ ముఖి చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంటున్న హేమంత్‌ విక్రమ్‌

ప్రజాశక్తి-అనంతపురం : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐపిఆర్‌)-గౌహతి నాలుగో స్నాతకోత్సవంలో తెలుగుతేజం హేమంత్‌ విక్రమ్‌ బంగారు పతకం అందుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురం వాసి అయిన హేమంత్‌ విక్రమ్‌ మైసూరులోని జెఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ కళాశాలలో పిహెచ్‌డి పూర్తి చేశాడు. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్స్‌ అనాలసిస్‌లో 9.78 మార్కులు సాధించాడు. అన్ని విభాగాల్లోనూ మంచి మార్కులు పొందాడు. శుక్రవారం ఎన్‌ఐపిఆర్‌ాగౌహతి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నాలుగో స్నాతకోత్సవంలో అస్సాం గవర్నర్‌ జగదీశ్‌ ముఖి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా హేమంత్‌ విక్రమ్‌ మాట్లాడుతూ.. ఈ అవార్డును తన తల్లిదండ్రులైన పిఆర్‌.రాయచంద్రప్ప, వరలక్ష్మీలకు అంకితం చేస్తున్నానని చెప్పారు. ఫార్మస్యూటికల్స్‌లో రీసెర్చు అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులను తయారు చేయాలన్నది తన లక్ష్యమని తెలిపాడు. ఈ అవార్డు తమ కుమారుడికి రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రి రామచంద్రప్ప బిఎస్‌ఎఫ్‌లో ఎఎస్‌ఐగా ఉద్యోగ విరమణ చేశారు.