Feb 25,2023 19:08

ప్రచారం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -వెంకటాచలం :మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రయివేటు విద్యా సంస్థల్లో శనివారం పట్టభద్రుల ఎంఎల్‌సి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంచర్ల శ్రీకాంత్‌కు మద్దతుగా టిడిపి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపి బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి వల్లెపు మునుస్వామి, తెలుగు యువత సర్వేపల్లి నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి ఆస్తోటి నాగరాజు ఉన్నారు.
తోటపల్లిగూడూరు : ఎంఎల్‌సి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌ తరపున ఆ పార్టీ నాయకులు మండలంలోని ప్రచారం చేశారు. టిడిపి మండల కన్వీనర్‌ సన్నారెడ్డి సురేష్‌ రెడ్డి, వరిగొండ చినబాబి రెడ్డి, మాజీ ఎంపీపీ ఇంగిలేల నిర్మలమ్మ, ముత్యాల శ్రీనివాసులు, సోమిరెడ్డి రేవంత్‌ రెడ్డి, సర్పంచ్‌ ఇంగిలేల వెంకట చైతన్య కుమార్‌, నెల్లిపూడి సుధాకర్‌ రెడ్డి తదితరులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం చేశారు.