Sep 12,2023 22:06

విద్యార్థిని అభినందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - జగ్గయ్యపేట రూరల్‌: మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన అంభోజి వెంకటేశ్వర్లు, సువర్ణ లత కుమార్తె అంబోజి సింధూజ నీట్‌ పరీక్షల్లో సత్తా చాటి ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. నీట్‌లో 720 మార్కులకు గానూ 442 మార్కులు సాధించి ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించింది. ఈ సందర్భంగా మల్కాపురం గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్‌ అంభోజి జాన్‌ ఆధ్వర్యంలో సింధూజను ఘనంగా సన్మానించారు. సింధుజ తండ్రి ఖమ్మం పట్టణంలో ట్యూషన్‌ పాయింట్‌ నడుపుతారు. పేద కుటుంబానికి చెందిన సింధూజ కష్ట పడి చదివి ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజిలో ఎంబిబిఎస్‌ ఫ్రీ సీట్‌ సాధించడం పట్ల గ్రామస్తులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ అంభోజీ జాన్‌ మాట్లాడుతూ కష్టపడి చదివితే ఫలితం దానంతట అదే వస్తుందని సింధూజ నిరూపించిందని, గ్రామంలోనే మొదటిగా ఎంబీబీఎస్‌ సీటు సాధించిన సింధుజాను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంభోజి చిన్న అక్కులు, నాగమ్మ, వంగూరి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.