Apr 09,2023 15:43

ప్రజాశక్తి-పీలేరు: ముస్లీంల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు బట్టలు రంజాన్ తోఫాగా పంపిణీ చేసినట్లు జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎండి షఫీ, గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ జీనత్ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రకాశం రోడ్డులోని షఫీ షామియానా సప్లయర్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో రూ.4.50 లక్షలు విలువచేసే బట్టలు రంజాన్ తోఫాగా పేదలకు, గ్రామ పంచాయతీ కార్మికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ మాసం సందర్భంగా తమ శక్తి కొద్దీ పేదలకు వస్త్ర, ఆహార వస్తువులను ఆనవాయితీగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈసారి కూడా మహిళలకు చీరలు, పురుషులకు ఫ్యాంట్, షర్ట్లు రంజాన్ తోఫాగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్త మిట్టమీద గిరి, గ్రామ పంచాయతీ కార్మికులు, పేద ప్రజలు పాల్గొన్నారు.