ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్య) : మండల పరిధిలో పిల్లల టీకాలు మరియు గర్భిణీలకు పోషకాహర, ఐరన్ మాత్రల పంపిణీలపై జిల్లా వైద్యాధికారి (డి ఎం హెచ్ ఓ) డాక్టర్ కొండయ్య శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారిని డాక్టర్ సృజన మండల పరిధిలోని లేబాక హరిజనవాడ, చెన్నయ్య గారి పల్లి, నల్ల తిమ్మాయ పల్లి గ్రామాలలో టీకాల కార్యక్రమం మరియు గర్భిణీలకు మాత్రల పంపిణీ, పోషకహారం పంపిణీ మరియు ఇతర కార్యక్రమాల అమలుపై జిల్లా వైద్యాధికారికి వివరించారు. ఆడపూరు హరిజనవాడ లో ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్, అంగన్వాడీ కేంద్రం మరియు కంటి వెలుగు కార్యక్రమం తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, సిహెచ్ ఓ నారాయణ, కంటి పరీక్ష నిపుణులు చంద్ర శేఖర్, సిద్దరామయ్య, లక్షుమయ్య, సుబ్బయ్య, ఎం ల్ హెచ్ పి లు, ఏన్ఎంలు, 104 సిబ్బంది , ఆశలు పాల్గొన్నారు.










