Sep 12,2022 22:59

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానానికి ముంబై నేవికి చెందిన రికన్‌ మెరైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన జి. హరికష్ణారెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహాల అలంకరణ నిమిత్తం సుమారు 1,308 గ్రాముల బరువు గల మూడు బంగారు కిరీటాలను ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబని సోమవారం కలిసి దేవస్థానానికి సమర్పించారు. ఆలయ అధికారులు దాత కుటుంబానికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించగా ఆలయ ప్రధానార్చకులు వీరికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం కార్యనిర్వహణాధికారి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.