ప్రజాశక్తి - వన్‌టౌన్ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ప్రధాన రహదారిపై ఇటీవల కొండ చరియలు పడిన ప్రదేశాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్నితో కలిసి మంగళవారం పరిశీలించారు. అయితే కొండ చరియలు పడిన ప్రాంతంలో మరింత ప్రమాద భరితంగా పడటానికి సిద్దంగా వున్న కొండ రాళ్ళను గత వారం రోజులుగా దేవస్థానం అధికారులు తొలగింపు పనులు చేపట్టిన విషయం విధితమే. ఈ నేపధ్యంలో నగర పోలీస్ కమిషనర్ కొండ రాళ్ళ తొలగింపు ప్రాంతాన్ని పరిశీలించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రమాదాలు లేకుం డా చూడాలని పోలీసులు విధులు నిర్వహిం చాలని కోరారు. అయితే దుర్గగుడి ప్రధాన రహదారి కేశఖండన వద్ద పడిన కొండ రాళ్ళ తొలగింపు నేపధ్యంలో రెండు మూడు రోజులు అటు వన్‌టౌన్, ఇటు కుమ్మరిపాలెం వైపు దారి మూసివేసిన పోలీసులు తదనం తరం కొండ తొలిచే ప్రాంతాన్ని మూసివేసి పక్కన వున్న మరో వైపు నుండి రెండు వైపులా వాహనాలకు దారి కల్పించారు. సిపి వెంట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సిఐ సురేష్ రెడ్డి ఉన్నారు.
దుర్గగుడి వద్ద కొండ రాళ్లు తొలగిస్తున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిపి కాంతి రాణా టాటా తదితరులు










