Jan 02,2023 20:09

దుప్పట్లు పంపిణీ చేస్తున్న మంత్రి కాకాణి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మండలంలోని నరుకూరు తెలుగు బాప్టిస్ట్‌ చర్చిలో దుప్పట్లు పంపిణీ చేశారు. ''హెల్పింగ్‌ హాండ్స్‌'' సంస్థ ఆధ్వర్యంలో, చర్చి చైర్మన్‌ సాదేపల్లి బోయదాస్‌, సెక్రటరీ సాదేపల్లి బాల ప్రసాద్‌, ట్రెజరర్‌ దువ్వూరు కోటేశ్వరరావు పర్యవేక్షణ లో జరిగిన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి గోవర్ధన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. వైసిపి కన్వీనర్‌ ఉప్పల శంకరయ్య గౌడ్‌, మాజీ సర్పంచ్‌ ఆకుల మధు, వెలిచర్ల శ్రీనివాసులు, చర్చి విశ్వాసులు పాల్గొన్నారు.