దుప్పట్లు అందజేస్తున్న నాయకులు
దుప్పట్లు పంపిణీ
బిట్రగుంట:బోగోలు మండలం లోని చెంచులక్ష్మి పురం గ్రామంలో సోమవారం కాండ్ర సతీష్ నాయుడు యువ నేస్తం ద్వారా నిరుపేద గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా బాపట్ల వెంకటపతి పాల్గొని నిరుపేద గిరిజన కుటుంబాలకు దుప్పట్లు అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. సమాజంలో కోట్లు గడించిన వారు ఎందరో ఉన్నప్పుటికి పేదవారికి సహాయం చేయాలన్న ఆలోచన కొందరికే పరిమితమన్నారు. వారిలో కాండ్ర సతీష్ నాయుడు వంటి వారు చలికాలం చలి కాలంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఈ విషయాన్ని వారి దష్టికి తీసుకొని పోగా వెంటనే వారు స్వందించి పేదప్రజలకు దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో జయ ంపు అశోక్, పీట్ల ప్రత్యూ ష్, రాచగిరీ వెంకటే శ్వర్లు, ప్రాంక్లిన్. స్థానిక గిరిజన నేతలు పాల్గొన్నారు.










