Sep 13,2022 23:09

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, దేవస్థానం ఇఓ భ్రమరాంబతో కలిసి మంగళవార పరిశీలించారు. యాత్రికుల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రసాదం కౌంటర్లు, విఐపి మార్గం, అన్నదానం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ ఢిల్లీరావు, ఇఓ భ్రమరారబ ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె.వి.ఎస్‌ కోటేశ్వరరావు, లింగం రమాదేవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.