ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం, ఇంద్రకీలాద్రిపై ఈనెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను సోమవారం రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డా.హరి జవహర్, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, అదనపు కమిషనర్ చంద్ర కుమార్, సంయుక్త కమిషనర్ (ఎస్టేట్స్) ఆజాద్, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె.వి.ఎస్ కోటేశ్వరరావు, లింగం రమాదేవి, సహాయ కార్యనిర్వహణాధికారి బి. వెంకట రెడ్డి పాల్గొన్నారు.










