ప్రజాశక్తి-జగ్గయ్యపేట
డప్పు కళాకారులకు డప్పు, గజ్జలు, యూనిఫామ్ లు ఇవ్వాలని కోరుతూ గురువారం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో కుల వివక్ష పోరాట సంఘం, డప్పు కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మండల అడ్మినిస్ట్రేటివ్ అధికారి మాధవ శర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కుల విక్షత పోరాట సంఘం జిల్లా కార్యదర్శి జి. నటరాజ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డప్పులు పండగ నిర్వహిస్తామని చెప్పి ఒక్కొక్క జిల్లాకి రూ1.60 వేలు కేటాయించి గజ్జలు, డప్పులు, యూనిఫామ్ కొని మండల ఎండిఓ ఆఫీసులలో నిరుపయోగంగా ఉంచారన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అవి డప్పు కళాకారులకు ఇవ్వలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి డప్పు కళాకారులకు డప్పు, గజ్జలు, యూనిఫామ్ వెంటనే పంపిణీ చేయాలని కోరారు. అలాగే డప్పు కళాకారులకు ఇస్తున్న 3000 పెన్షన్ ను 5000 రూపాయలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జగ్గయ్యపేట మండల అధ్యక్షులు అంబోజి విద్యాసాగర్, కెవిపిఎస్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కూచిపూడి చిట్టిబాబు, కెవిపిఎస్, డప్పు కళాకారుల సంఘం నాయకులు ఆదిమల్ల సుధాకర్, ఆదిమల్ల నాగేశ్వరరావు, దాములూరి నాగరాజు, కుక్కల ముత్తయ్య, పాము ప్రభాకర్, యండ్రాతి హుస్సేన్, యండ్రాతి గోపయ్య, తాళ్లూరు వెంకటరత్నం, కొమ్ము దేవయ్య, గుర్రాల లక్ష్మయ్య పాల్గొన్నారు.










