ప్రజాశక్తి - జగ్గయ్యపేట : ప్రస్తుతం రాష్ట్రంలో దళితులు, మహిళలపై దాడులు పెరిగాయని అటువంటి దాడులను అరికట్టి దళిత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో నాయకులు జుజ్జువరపు వెంకటరావు, కోటా కష్ణులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు చేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీలకే కేటాయించి ఎస్సీలను అభివద్ధి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయితే నిందితులకు 41 పి ఆర్ సి చట్టం కింద బెయిల్ మంజూరు చేయటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎం సూర్యారావు, జగ్గయ్యపేట సిఐ జానకిరామ్, ఎస్సై రామారావు, న్యాయవాది నాగభూషణం పాల్గొన్నారు.










