Feb 28,2023 22:37

రాస్తారోకోలో పాల్గొన్న నాయకులు, గ్రామస్తులు

ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల కేంద్రంలోని ఎన్టీఆర్‌ సర్కిల్లో ఏర్పాటు చేసిన డివైడర్‌ను తొలగించాలని వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా నాయకులు పెద్దన్న మాట్లాడుతూ ఆర్‌ అండ్‌ బి అధికారులు, కాంట్రాక్టర్‌ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డివైడర్‌ను తొలగించాలని పోలీసు, రెవెన్యూ అధికారులను కోరామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డివైడర్లు తొలగించాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల లోపు తగిన చర్యలు తీసుకుంటామని సంబందిత అధికారులు హామీ ఇచ్చారు. దీంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనుమయ్య, వెంకటేష్‌ , రంగప్ప, మాబు, కొండా వెంకటేశులు, శీలా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.