Sep 12,2022 22:59

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
కృష్ణాజిల్లా వీరవల్లిలో నిర్మిస్తున్న డెయిరీకి ఆర్ధికసాయం అందచేయాలని కేంద్ర మంత్రి రూపాలాకు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు విజ్ఞప్తిచేశారు. గ్రేటర్‌ నోయిడాలోని ఇండియా ఎక్స్‌-పో సెంటర్‌, మార్ట్‌లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ డెయిరి ఫెడరేషన్‌ వరల్డ్‌ డెయిరీ సమ్మిట్‌- 2022 ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించగా, ఈ వరల్డ్‌ డెయిరి సమ్మిట్‌లో కష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు చలసాని చక్రపాణి సోమవారం పాల్గొని మంత్రికి వినతిపత్రం అంద జేశారరు. ఈ సందర్భంగా కేంద్ర ఫిషరీస్‌, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి పురుషోత్తం ఖోడాభారు రూపాలాను కలిసి, కష్ణా మిల్క్‌ యూనియన్‌ పాడి రైతులకు చెల్లిస్తున్న అత్యధిక ధర, బోనస్‌, సమితి అందిస్తున్న పాడి రైతు, పశుసంక్షేమ కార్యక్రమాలను ఆంజనేయులు ఆయనకు వివరించారు. కృష్ణా సమితి వీరవల్లిలో 4 లక్షల లీటర్ల కెపాసిటీతో, 6 లక్షల లీటర్ల విస్తరణ సామర్ధ్యంతో నిర్మిస్తున్న అత్యాధునిక నూతన డెయిరీకి ఆర్ధిక సహాయం అందించి తద్వారా లక్షా యాబైవేల పాడి రైతుల అభివద్ధికి కషి చేయాలని విన్నవించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ వరల్డ్‌ డెయిరి సమ్మిట్‌ 2022 భారత దేశ పాడి పరిశ్రమకు తద్వారా పాడి రైతుల అభివద్ధికి మరింత దోహద పడుతుందని ఆంజనేయులు తెలిపారు.