Jan 02,2022 07:49

న్యూఢిల్లీ :  దేశంలో కొన్నేళ్లుగా ఆలయాలు, ఇతర హిందూ మతపరమైన సమావేశాల వద్ద జరిగిన తొక్కిసలాటలో వందలాదిమంది మరణించారు.
 

2000 తర్వాత దేశంలో చోటుచేసుకున్న పెద్ద విషాదాల జాబితా
- 2003 ఆగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. దాదాపు 140 మంది గాయపడ్డారు.
- 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధర్‌దేవి ఆలయంలో వార్షిక తీర్థయాత్రలో 340 మందికి పైగా యాత్రికులు తొక్కివేయబడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. యాత్రికులు కొబ్బరికాయలు పగలకొడుతుండగా కొంతమంది మెట్లపై జారిపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
- 2008 ఆగస్టు 3న హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో నైనా దేవి ఆలయం వద్ద రాళ్లు విరిగిపడ్డాయని సమాచారం రావడంతో, జరిగిన తొక్కిసలాటలో 162 మంది మరణించారు. 47 మంది గాయపడ్డారు.
- 2008 సెప్టెంబరు 30న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ నగరంలోని చాముండా దేవి ఆలయంలో బాంబు పేలుడు జరుగుతుందనే పుకార్లతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 250 మంది యాత్రికులు మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు.
- 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో కృపాలు మహారాజ్‌కు చెందిన రామ్‌ జాంకీ ఆలయం వద్ద ఉచితంగా బట్టలు, ఆహారం అందజేస్తున్నారని, అక్కడికి వచ్చిన పేదలు సుమారు 63 మంది తొక్కిసలాటలో మరణించారు.
- 2011 నవంబరు 8న హరిద్వార్‌లో గంగానది ఒడ్డున హర్‌-కీ-పౌరీ ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం 20 మంది చనిపోయారు.
- 2012 నవంబరు 19న పాట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న అదాలత్‌ ఘాట్‌ వద్ద ఛత్‌పూజ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, తాత్కాలిక వంతెన గుహలో పడటంతో దాదాపు 20 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
- 2013 అక్టోబరు 13న మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌ఘర్‌ ఆలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. యాత్రికులు దాటుతున్న నది వంతెన కూలిపోతుందన్న పుకార్లతో తొక్కిసలాట జరిగింది.
- 2014 అక్టోబరు 3న దసరా వేడుకలు ముగిసిన కొద్దిసేపటికే పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన తొక్కిసలాటలో 32 మంది మరణించగా, 26 మంది గాయపడ్డారు.
- 2015 జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాలు ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రధాన స్నానఘట్టం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది యాత్రికులు మరణించారు. 20 మంది గాయపడ్డారు.