Sep 12,2023 22:04

మాట్లాడుతున్న విద్యాకన్నా


ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : ప్రముఖ తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ రెజీనా జీవితం ఎంతో మంది మహిళలకు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు అన్నారు. జన శిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యంలో స్టెల్లా కళాశాల తెలుగు రీడర్‌ డాక్టర్‌ రెజీనా సంస్మరణ సభ మంగళవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొని రెజీనా చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జన శిక్షణ సంస్థాన్‌చైర్మన్‌ డాక్టర్‌ నాగళ్ల విద్యాకన్నా మాట్లాడుతూ డాక్టర్‌ రెజీనా మరణం చాలా దిగ్భాంతికి గురిచేసిందన్నారు. ఆమె జీవితం ఎంతో మంది మహిళలకు ఆదర్శప్రాయమని అన్నారు. బోధనాసుపత్రిలో ఉన్న వారికి ఆమె అనుసరించిన విధి విధానాలు చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్‌ రెజీనా మేరిస్‌ స్టెల్లా కళాశాల నందు ఎన్నో ఏళ్లుగా తెలుగు బోధనా ఉపాధ్యాయులుగా సేవలు చేయడమే కాకుండా, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వరకట్న సమస్యలు, అశ్లీలతకు వ్యతిరేకంగా పోరాటాలు నడిపిన వారిలో ఒకరని అన్నారు. తరుణీ తరంగాలు నిర్వాహకురాలు వి.జ్యోత్న్సి, డాక్టర్‌ రావి శారద మాట్లాడుతూ సమాజంలో ఎన్నో మహిళా సమస్యలు ఉన్నప్పటికీ ముందుకు వచ్చి పోరాడే మహిళలు అతి తక్కువ మంది ఉంటారన్నారు. ఐద్వా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ డాక్టర్‌ రెజీనా స్త్రీల సమస్యలపై పోరాడిన విధానాలు చిరకాలం గుర్తిండిపోతాయని అన్నారు. మహిళా సంఘం నాయకురాలు పి.దుర్గ భవానీ మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో రెజీనా లాంటి మనుషులు సమజానికి ఎంతో అవసరమని అన్నారు. ఈకార్యక్రమంలో మహిళా సంఘం నేతలు జి.వాణి, పలువరు స్థానికులు పాల్గొన్నారు.