డాక్టర్ ప్రభాకరనాయుడుకు సత్కారం
ప్రజాశక్తి-కావలి : నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం గుండెమడుగుల దేవదానం మెమోరీయల్ హాస్పిటల్‌లో ప్రముఖ వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ నాయుడుని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, కలిసి నూతన సంవత్సరశుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ డాక్టర్ ప్రభాకర్‌నాయుడు 86యేళ్ల వయస్సులోనూ అన్నివేళలా వైద్య శాలలో ఉంటూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకే, కాకుండా ఏ సమయంలో అయిన వచ్చిన అనారోగ్యులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు, అందిస్తున్నారని కొనియాడారు. ఇలాగే వారి వైద్య సేవలుప్రజలకు అందించాలని, కోరుకుంటూ హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్థోఫెడిక్ వైద్యులు డాక్టర్ ఎన్.శివకుమార్, స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు, ఖాదర్‌బాషా, వాయిస్ అఫ్ ముస్లిం మైనారిటి మొఘల్ సలీం బేగ్, రెవెన్యూ ఉప తహశీల్దార్, మొఘల్ శిరాజ్ బేగ్, హ్యాపీ సంస్థ ఘనిాషా, విశ్రాంత లెక్చరర్ ప్రసాదరావు, ప్రభాకర్, లోక్ సత్తా మాలకొండారెడ్డి, ఎంపిజె అధ్యక్షులు షేక్ రఫీ అహమ్మద్, ప్రియదర్శిని మహిళామండలి, ఖాదర్‌బీ, ప్రసన్న కుమార్, గౌస్ మొహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు.










