పీలేరు : తూర్పు రాయలసీమ మాజీ శాసనమండలి సభ్యులు దివంగత దాచూరి రామిరెడ్డికి పీలేరు యుటిఎఫ్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. దాచూరి 7వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం పీలేరు యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో యుటిఎఫ్ నాయకులు సమావేశమై దివంగత నేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామిరెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక వర్గాలకు ఎనలేని సేవ చేశారని, ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, సమాజ శ్రేయస్సుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని రాష్ట్ర నాయకులు సదాశివరెడ్డి కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రీ గ్రూప్ స్కేల్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్స్ లాంటి ఎన్నో మహౌన్నతమైనటువంటి అంశాలను ఉద్యోగులకు సాధించిపెట్టిన గొప్ప నాయకుడు ఆయనని, అలాగే విధాన పరిషత్‌లో రెండు సార్లు ఎన్నుకోబడి పిడిఎఫ్ నాయకుడిగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ నేతకు ప్రత్యేకించి చిత్తూరు జిల్లా అంటే ఎనలేని అభిమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు రాధాకష్ణ, చంద్రశేఖర్, శివారెడ్డి, అక్రం బాష, విజరు, సంగారెడ్డి, ఈశ్వర మహేంద్ర, నారాయణ నాయుడు, మున్రెడ్డి, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, వెంకటరమణ, దేవేందర్ రెడ్డి, మహేంద్ర, వేణుగోపాల్, తదితర నాయకులు పాల్గొన్నారు.










