Sep 30,2023 14:29
  • సమస్యలు పరిష్కారం కోసం వస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అరెస్ట్
  • 49 మంది విద్యార్థులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

ప్రజాశక్తి-వన్ టౌన్ : సమస్యలు పరిష్కరించకుండా పోరాడుతున్న విద్యార్ధులను అణచివేయాలని చూడడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వానికి హితువు పలికారు. విద్యార్దుల అరెస్టులను ఆయన ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చలో విజయవాడ కార్యక్రమం భాగంగా గాంధీనగర్ ధర్నా చౌకలో ధర్నాకు వచ్చిన ఎస్ఎఫ్ఐ విద్యార్థిలను శనివారం అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు 49 మంది విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, హాస్టల్లో సదుపాలను మెరుగుపరచాలని, మెస్ చార్జీలు పెంచాలని, జిల్లా స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పెట్టాలని, పలు సమస్యల మీద పోరాటానికి విజయవాడ వచ్చిన విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు,  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్ సిహెచ్.శ్రీనివాస్, సిఐటియు పశ్చిమ సిటీ అధ్యక్షులు వెంకట్రావు, 50వ డివిజన్ కార్పొరేటర్ బి.సత్యబాబు అరెస్ట్ అయిన విద్యార్థులను కలిసి పరామర్శించారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.

cpm-leader-meet-arrested-students-in-one-town-vsr

 

cpm-leader-meet-arrested-students-in-one-town-bsb