న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,383 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లకు చేరింది. కేరళ, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 38,652 మంది వైరస్ నుండి కోలుకున్నారు. 507 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 4.18లక్షలకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాలు రేటు 1.34శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 4,09,394 యాక్టివ్ కేసులున్నాయి. బుధవారం 22.77లక్షల మందికి వ్యాక్సిన్లు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.










