చెన్నై : తమిళనాడులోని చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న రైతులపై పాత భవనం కూలడంతో ముగ్గురు రైతులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈరోడ్ జిల్లా అంధియూరు సమీపంలోని ఒక పాత భవనం అక్కడే నిద్రిస్తున్న రైతులపై కూలిపోవంతో.. వారు అక్కడిక్కడే మృతిచెందారు. వివరాల ప్రకారం.. బర్గూరుకొండ ప్రాంతానికి చెందిన ఆరుగురు రైతులు తమ ఉత్పత్తులను అంధియూరులోని వారాంతపు సంతలో విక్రయించేందుకు వచ్చారు. ఆదివారం రాత్రి అంధియూరు సమీపంలోని ఒక భవనం ముందు నిద్రపోయారు. శిథిలావస్థలో వున్న ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో రైతులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక దళం సహాయక చర్యలు ప్రారంభించింది. శిథిలాల నుండి ముగ్గురి రైతుల మృతదేహాలను వెలికితీశామని, గాయాలపాలైన మరో ముగ్గురు రైతులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.










