ప్రజాశక్తి-నిమ్మనపల్లి: మదనపల్లి- నిమ్మనపల్లి రోడ్డులోని ముష్టూరు క్రాస్ వద్ద సిమెంటు లోడ్ తో వస్తున్న లారీ బోల్తా పడిన సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి అల్ట్రాటెక్ సిమెంటు లోడుతో నిమ్మనపల్లెకు వస్తున్న అశోక్ లైలాండ్ ఏపీ02x6757 నెంబర్ గల లారీ గురువారం ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో ముష్టూరు క్రాస్ వద్ద ఉన్న మలుపులో బోల్తా పడిందని అన్నారు. లారీ వేగంగా వస్తూ మలుపులో అదుపుతప్పి బోల్తా పడినట్లుగా తెలిపారు. లారీ డ్రైవర్ చింటూ బాలు కు స్వల్పంగా గాయాలు కావడంతో, ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు. లారీ డ్రైవర్ ను వైద్య నిమిత్తం 108 వాహనం ద్వారా మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.










