Mar 05,2023 22:15

సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మీనాక్షి సుందరి

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేశ్వరరావు, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మీనాక్షి సుందరి సూచించారు. పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ల హాస్టల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి చదువుతోపాటు రాజ్యాంగం, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం హాస్టల్‌లో భోజన సదుపాయాల గురించి వార్డెన్‌ ప్రసన్నకుమారిని విచారించారు. ఈ సదస్సుకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లింగాల లోకేశ్వర్‌ రెడ్డి, న్యాయవాదులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.