Feb 27,2023 21:45

ఫొటో : చంద్రశేఖర్‌అజాద్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు

చంద్రశేఖర్‌అజాద్‌కు ఘన నివాళులు
ప్రజాశక్తి-ఎఎస్‌పేట : ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ వర్థంతి వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలకు సంబంధించిన గ్రిగ్‌ మెమోరియల్‌ కోరిమెర్లలో జరిగిన టోర్నమెంట్‌లో జిల్లాప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల అనుమసముద్రం పేట విద్యార్థిని విద్యార్థులు త్రో బాల్‌ సీనియర్‌ బాలురు, ఖోఖో సీనియర్‌ బాలురు, బాలికలు, హ్యాండ్‌బాల్‌లో సీనియర్‌ బాలురు, బాలికలు విజేతలుగా నిలిచారు.
ఈ సందర్భంగా ఛాంపియన్‌ షిప్‌ సాధించడానికి కారకులైన టి వి సురేష్‌ వ్యాయామ ఉపాధ్యాయుల వారిని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. షీల్డ్‌లను, మెరిట్‌ సర్టిఫికెట్లు, మెడల్స్‌ సాధించిన విద్యార్థులకు ప్రదానోపద్యాయులు సయ్యద్‌ అబ్దుల్‌ హమీద్‌, ఇన్‌ఛార్జి సుధాకర్‌ రావు, హరికృష్ణ, అబ్దుల్‌ షరీఫ్‌, ఎమ్‌డీ యేజాస్‌, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.