Mar 04,2023 22:18

చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరుతున్న ధర్మవరం వైసీపీనాయకులు

ధర్మవరం టౌన్‌ : వైసిపి ధర్మవరం పట్టణ మాజీ కన్వీనర్‌ గడ్డంకుళ్లాయప్ప తన అనుచరులతో శనివారం విజయవాడలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరారు. ధర్మవరం పట్టణ వైసీపీ మాజీ కన్వీనర్‌ గడ్డంకుళ్లాయప్ప, పట్టణ మాజీ ప్రధానకార్యదర్శి అస్లాం, పట్టణ కోశాధికారి బడిగింజల రమణ, మాజీ జిల్లా స్టీరింగ్‌ కమిటి అధ్యక్షులు పటాన్‌అక్బర్‌, 25వ వార్డు వైసీపీ మాజీ ఇన్‌ఛార్జి మాధవరెడ్డిలను ధర్మవరానికి చెందిన ముఖ్యనాయకులు చింతలపల్లి మహేశ్‌ చౌదరి, ఫణికుమార్‌, నాగూరుస్సేన్‌, చింతపులుసు పెద్దన్న చంద్రబాబు వద్దకు పిలుచుకుని వెళ్లారు. ఈ మేరకు శనివారం మంగళగిరి కార్యాలయంలో వారికి చంద్రబాబునాయుడు పార్టీ కండువా వేసి పార్టీకి సాధారంగా ఆహ్వానించారు. రాబోవు ఎన్నికలలో టీడీపీ గెలుపే లక్ష్యంగా కృషిచేయాలని చంద్రబాబునాయుడు సూచించినట్లు గడ్డంకుళ్లాయప్ప తెలిపారు.