Dec 27,2022 18:46

చంద్రబాబు పర్యటనకు మహిళలను ఆహ్వనిస్తున్న తెలుగు మహిళలు

ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరులో ఈ నెల 28న జరగనున్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్‌ షోను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మహిళలకు తెలుగు మహిళలు బొట్టు పెట్టి ఆహ్వానం పలుకుతున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా సైన్యం నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు కె.కుసుమ కుమారి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దివి సౌభాగ్య, పార్లమెంట్‌ మహిళా కమిటీ అధికార ప్రతినిధి బత్తిన ఆదెమ్మ, పట్టణ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, పిడికిటి లక్ష్మి, తాటికొండ దాక్షాయిని, పొడపాటి రాధ, అమ్మనబోయిన రత్తమ్మ, కంసాని మయూరి, బక్కమంతల మమత, ఎండ్లూరి ఎస్తేరమ్మ, ముప్పరాజు హారిక, కొత్తపల్లి శేషమ్మ పాల్గొన్నారు.