Mar 02,2023 21:55

వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ ఇంద్రజ, తదితరులు

ప్రజాశక్తి-హిందూపురం : చిన్నారుల ఆలోచనలకు ప్రతిరూపం వారు చేసినా అద్బుత ప్రయోగాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వేణు విద్యా విహార్‌లో పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మండల విద్యాశాఖ అధికారి గంగప్ప, ప్రవేటు స్కూల్స్‌ అసోసియోషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులు రూపొందించిన నమూనాలను వారు తిలకించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రయోగాల్లో ఉత్తమమైన వాటిని న్యాయమూర్తులచే ఎంపిక చేసి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ నాసీరాభాను, పాఠశాల కరస్పాండెట్‌ వేణుగోపాల్‌, ప్రవేటు స్కూల్స్‌ అసోసియోషన్‌ జిల్లా నాయకులు రీయాజ్‌, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.