Apr 10,2023 15:29

ప్రజాశక్తి-నందలూరు : ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 62 మంది గర్భవతులకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని డాక్టర్ సృజన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ గర్భవతులకు బిపి, రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 20 మంది గర్భవతులను హై రిస్క్ కేసులుగా గుర్తించి గర్భవతులను ఒక్కొక్కరిని ట్యాగ్ చేయడం జరిగిందన్నారు. గర్భిణీలుగా ఉన్న సమయంలో గుర్రపు వాతము, మధుమేహం, థైరాయిడ్, గుండె జబ్బులు ఉన్న వారిని పరీక్షించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రతి నెల 9,10 తేదీలలో జరిగే కార్యక్రమం గర్భిణీలందరు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సూపెర్వైసోర్ హిమ శంకరి, ఏఎన్ఎంలు , ఆశలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.