Dec 03,2022 21:30

రాష్ట్ర మహాసభల పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : భూ పోరాటాలను ఉధృతం చేస్తామనివ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు శనివారం ముగిశాయి.ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా సంఘం పోరాటంలో చురుకుగా పాల్గొన్న కార్యకర్తలు 60 మంది తో ప్రతినిధుల మహాసభ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్బంగా గత మూడు సంవత్సరాల నుంచి సంఘం చేసిన పోరాటాలు ఫలితాలపై సమీక్షించి పోరాటాల కొనసాగింపుపై చర్చించారు. 2023 జనవరి నెల నుండి జిల్లా వ్యాప్తంగా భూమి లేని పేదలను గుర్తించి భూ పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం నూతన జిల్లా కమిటీని 15 మందితో ఎన్నుకున్నారు. అధ్యక్ష , కార్యదర్శులుగా ప్రవీణ్‌ కుమార్‌, పెద్దన్న , కోశాధికారిగా రమేష్‌ , ఆఫీస్‌ బేరర్స్‌గా ఊటకూరు నాగరాజు, గంగాధర్‌, వెంకట లక్ష్మమ్మతో పాటు తొమ్మిది మంది జిల్లా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులతో కలిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర మహాసభలకు ప్రతినిధులుగా జిల్లా నుండి 8 మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ , అచ్చమ్మ , బాలస్వామి , నారాయణ , హనుమంతు , సరోజమ్మ , శివమ్మ తదితరులు పాల్గొన్నారు.