ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం చేపట్టిన సొంతింటి కల సాకారం కార్యక్రమంలో తాము భాగస్వాములవుతామని శ్రీసాయి వర్థిని ప్రమోటర్స్ అధినేత కొమ్మూరు రామకోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వమే స్థలాన్ని కేటాయించి అందులో గృహ నిర్మాణానికి బ్యాంకు నుండి రుణ సదుపాయం కల్పిస్తుందని, బ్యాంక్ నుండి లభించిన దానిలో 40 శాతం ప్రభుత్వ సబ్సిడీ లభించనుందని, ఇందుకోసం భూమిని సేకరిస్తుందని తెఉతెలిపారు. ఈ కార్యక్రమంలో తమను భాగస్వాములుగా చేయాలని, తమ భూమిని అప్పగించేందుకు రామకోటేశ్వరరావు ముడా వైస్ చైర్మన్ శ్రీకాంత్‌ను కలిసి అంగీకార పత్రాన్ని అందజేశారు.










