Feb 25,2023 21:13

మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
భూహక్కు రీ సర్వే పనులు వేగవంతం
నెల్లూరు :రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాశ్వత భూ హక్కు- భూ రక్ష పధకం నిర్వహణలో భాగంగా నగర వ్యాప్తంగా రీ సర్వే పనులను వేగవంతం చేయాలని కమిషనర్‌ హరిత ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం చేపడుతున్న వివిధ అంశాల పురోగతిపై కార్యాలయంలోని కమిషనర్‌ ఛాంబర్‌ లో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వార్డు సచివాలయ అడ్మిన్‌, ప్లానింగ్‌, రెవెన్యూ సెక్రెటరీలను సమన్వయపరచి రీ సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు. సచివాలయ కార్యదర్శులకు రోజూ వారీ రీ సర్వే లక్ష్యాలను నిర్దేశించి, లక్ష్యాలను అందుకునేల సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు
. అవసరమైన సమాచారం అందించడంలో వార్డు ప్లానింగ్‌ సెక్రెటరీలు, వార్డు రెవెన్యూ సెక్రటరీలు అడ్మిన్‌ కార్యదర్శులకు సహకరించేలా పర్యవేక్షించాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా రీ సర్వే పనులను పూర్తి చేసి సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్‌ లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ పరిధిలో వాణిజ్య ప్రకటనల ప్రదర్శన పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని మరియు నగరపాలక సంస్థ ద్వారా అనుమతి లేని ప్రకటన ప్రదర్శనలు సచివాలయం వారీ గా గుర్తించి వారికి నోటీసులు జారీ చేయలని కమిషనర్‌ ఆదేశించారు. 2016 సంవత్సరం నుంచి ప్రకటనల పన్నుల బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, నగర పాలక సంస్థ ఆస్తులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సూచించారు, మరియు అనుమతి లేని లేఅవుట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేయవలసినదిగా ఆదేశించారు.