Feb 24,2023 21:55

ఫొటో : మాట్లాడుతున్న తహశీల్దారు శ్రీనివాసులరెడ్డి

భూ సర్వేకు సహకరించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని శకునాలపల్లిలో జరిగే భూ రీసర్వేకు పంచాయతీ రైతులు గ్రామస్తులు సహరించాలని తహశీల్దార్‌ సానా.శ్రీనినాసుల రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సచివాలయం ఆవరణంలో రీ సర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శకునాలపల్లి, కుర్రపల్లి రైతులకు భూ సర్వేపై అవగాహన కల్పించి సర్వే చేపట్టే రెవెన్యూ సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. భూ రీసర్వేతో రైతులు తమ పొలం విస్తీర్ణం తెలుసుకోవచ్చని ఆన్లైన్ల పేర్లును నమోదు చేసుకోని సర్వే చేసుకోవచ్చన్నారు.
వన్‌ బీ, అడంగల్‌ లో ఏదైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని సర్వేలో తమ దగ్గర ఉన్న భూ సంబంధిత ధ్రువపత్రాలను దగ్గరలో ఉంచుకొని సిబ్బందికి సహరించి సర్వే చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కల్లూరి వెంకటేశ్వర్లు రెడ్డి, సచివాలయం సిబ్బంది, అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.