- జిజిహెచ్ సూపరింటెండెంట్‌కు కార్మికుల వినతి
ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: బయోమెట్రిక్ విధానం కార్మికులకు పెట్టవద్దని స్థానిక విజయవాడ జిజిహెచ్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ గౌరవాధ్యక్షులు ఎన్.కోటి మాట్లాడుతూ ప్రభుత్వ బయోమెట్రిక్ విధానం కార్మికులకి పెట్టడం వలన వారికి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కోల్పోతామని భయాందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌లో ఉన్న ఆశ, అంగన్వాడి, మున్సిపల్ కార్మికులకు అమ్మఒడి, సామాజిక పింఛన్లు రావటంలేదన్నారు. ఉన్నత అధికారులు స్పందించి బయోమెట్రిక్ విధానాన్ని కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతమ్మ, భాస్కరమ్మ, అఖిలపద్మ, కృష్ణకుమారి, రత్నకుమారి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










