Nov 16,2023 22:56

నిధులు మంజూరు పత్రం అందజేస్తున్న మంత్రి సురేష్‌


ప్రజాశక్తి-పెద్దదోర్నాల
పెద్దదోర్నాల మండలంలోని గంటావానిపల్లి గ్రామానికి కేజీరోడ్డు నుంచి తీగలేరు మీద హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ప్రభుత్వం రూ. 2.70 కోట్లు మంజూరు చేస్తూ జీవో నెంబర్‌ 763 జారీ చేసింది. ఈ జీవో కాపీని యర్రగొండపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గంటావానిపల్లి సర్పంచ్‌ యక్కంటి రమాదేవి, వెంకటేశ్వరరెడ్డిలకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అందజేశారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొండేటి వెంకటేశ్వరరెడ్డి, నడిపి రాములు, లక్ష్మయ్య, బాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.