ప్రజాశక్తి - వీరులపాడు, ఎ.కొండూరు, గంపలగూడెం : మిర్చి పంటను సోకిన బొబ్బర తెగులు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్‌టిఆర్ జిల్లా వీరులపాడు, ఎ.కొండూరు మండలాలతోపాటు ఇంకా పలు మండలాల్లో ఉధృతంగా ఉన్న బొబ్బర తెగులుతో రైతులు నష్టాలపాలువుతున్నారు. ఇప్పటిదాకా సాగుచేసిన తమ మిర్చి పంటను తొలగించేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రయత్నిస్తున్నారు. వీరులపాడు మండలంలోని పలు గ్రామాల్లో మిర్చికి బొబ్బర తెగులు సోకింది. దీంతో మిర్చి చాలా వరకు దెబ్బతినిపోయింది. మండలంలోని చౌటపల్లి గ్రామంలో దొడ్డపునేని రాధాకష్ణా అనే రైతు తన ఏడెకరాల్లో మిర్చిని సాగుచేశాడు. అయితే ఈ తెగులు సోకడంతో నాలుగెకరాల్లో పంటను పీకివేశాడు. మిగిలిన మూడెకరాల్లో కూడా పంటను పీకేసే పరిస్థితి ఏర్పడింది. మిర్చి సాగుకు ఇప్పటికే ఎకరానికి రూ.80 వేల చొప్పున సుమారు రూ.5.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. మిర్చి విత్తనాలను కంచికచర్లలో కొనుగోలు చేశారు. సత్యభామ కంపెనీకి విత్తనాలను ఒక్కో ప్యాకెట్ రూ.800 చొప్పున కొనుగోలు చేసి సొంతంగానే నారు పెంచుకొని మిర్చి సాగు చేపట్టాడు. కానీ తెగులు సోకి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదే గ్రామంలో
'బొబ్బర'తో బెంబేలు
ఇలాంటి పరిస్థితిని చాలా మంది రైతులు ఎదుర్కొంటున్నారు. ఉద్యానవన, వ్యవసాయ అధికారులు స్పందించి పొలాలను పరిశీలించాలని, మిర్చి సాగుకు, తెగులు నివారణకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతు సంఘం వీరులపాడు మండల కార్యదర్శి చాట్ల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధిత రైతులను ఆదుకోవాలి : రైతు సంఘం నేతలు
వైరస్ బారినపడి దెబ్బతిన్న మిర్చి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎ.కొండూరు మండలం చీమలపాడు, అట్లప్రగడ గ్రామాల్లో దెబ్బతిన్న మిర్చి పంటను రైతు సంఘం నాయకులు ఎస్.కష్ణారెడ్డి, ఆళ్ల అమ్మిరెడ్డి, దేశిరెడ్డి చిన్న లక్ష్మారెడ్డి, సోమా యోహాన్, బొమ్మెన శ్రీనివాసరావు, గొల్లమందల సర్పంచ్ డి.రాముడు మంగళవారం పరిశీలించారు. ఈ
బాధిత రైతులను ఆదుకోవాలి
సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బర తెగులుతో మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు. తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఏ.కొండూరు మండలంలో 4 వేల ఎకరాల్లో మిర్చి వేయగా, 80 శాతం ఎకరాల్లో బొబ్బర తెగులు బారిన పడ పంట పూర్తిగా దెబ్బతిన్నదని తగెలిపారు. ఇప్పటికే ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు రైతులు అప్పులు చేసి మరీ పెట్టుబడిగా పెట్టారని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు పంపి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో వ్యసాయ కార్మిక సంఘం నాయకులు పానెం ఆనందరావు, సిటిఐయు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, బాధిత రైతులు పాల్గొన్నారు.
అనుమానం వస్తే పెరికివేయండి : ఉద్యానవన అధికారి
మిర్చి మొక్కకు తెగులు సోకిందని అనుమానం వస్తే వెంటనే ఆ మొక్కను పెరికివేయాలని తిరువూరు ఉద్యానవ శాఖ అధికారి సోహైల్ అహ్మద్ తెలిపారు. మంగళవారం గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామంలో ఆయన మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో పంటకు రసం పీల్చే పురుగు ఉధతి ఎక్కువైందన్నారు. తద్వారా వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. మోతాదుకు
అనుమానం వస్తే పెరికివేయండి
మించి కాంప్లెక్స్ ఎరువులు వాడటం వలన భూమిలో భాస్వరం ఎక్కువ అవుతోందన్నారు. దీంతో సూక్ష్మ పోషకాలు అందక మొక్క బలహీన పడుతున్నట్లు వివరించారు. వైరస్ వ్యాప్తికి వాహకాలుగా ఉన్న తెల్ల దోమ, తామర పురుగు ఉధతిని గమనించేందుకు పసుపు, నీలం రంగు కలిగిన జిగురు అట్టలను పెట్టాలన్నారు. ప్రతి ఎకరాకు 30 నుండి 40 వరకు ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. తెల్ల దోమ ఉధతిని అరికట్టేందుకు పైరిప్రాక్సిఫెన్ (లానో) 10 శాతం ఈసీ ఎకరాకు 200 మిల్లీ లీటర్లు లేదా స్ప్రైరో మిసిఫెన్ 29.9 శాతం ఎస్‌సి ఎకరాకు 200 మిల్లీ లీటర్లు లేదా అఫిడోపైరోపెన్ 5 శాతం (సెఫీనా) ఎకరాకు 400 మిల్లీ లీటర్ల పిచికారీ చేయాలన్నారు. పురుగుమందులను మార్చి మార్చి వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.










