ఫొటో : మాట్లాడుతున్న జిల్లా అధికారి వై.వెంకటయ్య
బిసి హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : పట్టణంలోని బిసి వెల్ఫేర్ బాలికల, బాలుర బిసి హాస్టళ్లను ఆ శాఖ జిల్లా అధికారి వై.వెంకటయ్య ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుర హాస్టల్ విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ సిబ్బందిపై హాస్టల్ నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలంటూ మండిపడ్డారు. హాస్టల్లో ఉండే విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని వారి ఆహార ఏర్పాట్ల విషయంలో ఎటువంటి లోటుపాట్లు జరగకూడదని అటువంటి ఇబ్బంది కలిగిస్తే తగు చర్యలు తీసుకుంటామని సిబ్బందిని మందలించారు. వీరివెంట బిసి హాస్టల్ సంక్షేమ శాఖ అసిస్టెంట్ అధికారిణి ఎం.శ్రీదేవి, ఇతర సిబ్బంది ఉన్నారు.










