Jan 01,2023 22:09

ఫొటో : ఆదిరెడ్డిని సన్మానిస్తున్న మెట్టుకూరు చిరంజీవి రెడ్డి

బిగ్‌బాస్‌ ఆదిరెడ్డికి అభినందనలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మెట్టప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడులో పుట్టి కోట్ల మంది ప్రజలు అభిమానించే బిగ్‌బాస్‌ సీజన్‌ 6లోకి వెళ్లిన ఆదిరెడ్డిని ఆదివారం రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి అభినందించారు. కావలిలోని ఆదిరెడ్డి నివాసంలో కలిసి పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ గత కరోనా సమయంలో సోనూసూద్‌ ఫౌండేషన్‌కు ఐదు నెలల పెన్షన్‌ను తన చెల్లి నాగలక్ష్మి ద్వారా అందజేయించి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారని తెలిపారు.
అంతటితో ఆగకుండా మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జిల్లా కలెక్టర్ల సమక్షంలో సోనూసూద్‌ ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన యాక్సిడెంట్‌ ప్లాంటును నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించడం అంతటితో ఆగకుండా బిగ్‌బాస్‌ సీజన్‌ 6లోకి మన ఆదిరెడ్డి వెళ్లి టాప్‌ 4 కంటెంట్‌గా నిలబడి ఉదయగిరి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చారని అందుకు ఆదిరెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ గతంలో తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవిరెడ్డి ఉద్యోగం ఇప్పించి ఎంతగానో ఆదరించారని, ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరువలేనని తెలిపారు. కార్యక్రమంలో మెట్టుకూరు నిరంజన్‌రెడ్డి, మాలేపాటి వెంకీ తదితరులున్నారు.